అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలుగా పరిణమించాయని విమర్శించారు. శాసనమండలి రద్దుపై సీఎం జగన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టిందని తెలిపారు. వారి ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. (పూల ఖర్చు వృథా అయినట్టేనా బాబూ..!)
కాగా మరో ట్వీట్‌లో.. 'రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను దించాడు. ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగాడు. ఇప్పుడవన్నీ వదిలేసి కౌన్సిల్‌ను ఎలా రద్దు చేస్తారో చూస్తా అని రంకెలేస్తున్నాడు. చిట్టి నాయుడు, వెన్నుపోటు సహచరుడు నిరుద్యోగులవుతారని ఆయనకు భయం పట్టుకుంది' అని ట్వీట్ చేశారు.